విసాకోడేరు నుంచి షర్మిల 160వ రోజు పాదయాత్ర

భీమవరం (ప.గో.జిల్లా),

26 మే 2013: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 160వ రోజు ఆదివారం ఉదయం పాలకోడేరు మండలం విసాకోడేరులో ప్రారంభమైంది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కదలిరాగా శ్రీమతి షర్మిల పాదయాత్ర మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు, దానితో అంట కాగుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

విసాకోడేరు నుంచి ప్రారంభమైన ఆదివారంనాటి శ్రీమతి షర్మిల పాదయాత్ర వీరవాసరం మండలం మత్స్యపురికి చేరుతుంది. అక్కడ నుంచి బయలుదేరి ఆమె గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు, వీరవాసరం, బొబ్బనపల్లి గ్రామాలలో పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, జిల్లా కన్వీనర్‌ తెల్లం బాలరాజు తెలిపారు.

Back to Top