నేతలతో విజయమ్మ సమావేశం

హైదరాబాద్ 13 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పంచాయతీ ఎన్నికలపై శనివారం పార్టీ నేతలతో సమీక్షించారు. ఆసెంబ్లీ సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ ముఖ్యనేతలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతల నుంచి ఫోన్ ద్వారా విజయమ్మ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా నేతలకు ఆమె  దిశా నిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగియనుంది.

Back to Top