విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్న బాబు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.... వీటి భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరులో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...  విద్యార్థులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి, స్కాలర్షిప్, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.... పథకాలను చంద్రబాబు మరిచిపోయారన్ని ఎద్దేవా చేశారు.
Back to Top