<strong>ఢిల్లీః</strong> హోదా కోసం ఢిల్లీలో మరోమారు వైయస్‌ఆర్‌సీపీ గర్జించనుంది. ప్రత్యేకహోదా సాధనకు పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఇప్పటికే విశాఖ,నెల్లూరు, అనంతపురం, గుంటూరు,కాకినాడలో దీక్షలు చేపట్టారు. ఏపీ పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరసనగా రేపు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, తాజా మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గళం విప్పనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నేతలు విజయసాయిరెడ్డి, మేకపాటి, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. రేపటి వంచనపై గర్జన ఏర్పాట్లపై చర్చించారు. జంతరమంతర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంతరమంతర్ వద్ద వంచనపై గర్జన పోస్టర్‌ను విడుదల చేశారు.