వైయస్‌ఆర్‌సిపిలో 50 కుటుంబాల చేరిక

కొత్తవలస : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారంనాడు కొత్తవలస మండలం దెందేరులోని 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌సిపిలో చేరాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీని ‌విడిచిపెట్టి వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. వైయస్‌ఆర్‌సిపి నాయకుడు వల్లూరి జయప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా వల్లూరి మాట్లాడుతూ, ఎస్.కోట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో వై‌యస్‌ఆర్‌సిపి బలం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా వైయస్‌ఆర్‌సిపికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆరోపించారు. అర్హులైన వారికి పింఛన్లు సైతం రద్దు చేస్తోందన్నారు.
Back to Top