వైయస్ఆర్‌ సీపీలో టీడీపీ నేతల చేరిక

అనంతపురం:

అనంతపురం జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తలారి గోపాల్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు తలసాని పెద్దన్న, డెరైక్టరు అంకే పోతన్న ఆధ్వర్యంలో పలువురు టీడీపీ గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని తన నివాసంలో వైయస్‌ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top