వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీల కార్యకర్తలు

పలమనేరు:

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన సుమారు వంద మంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్ష్మీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను అస్యహించుకొనే తాము పార్టీలోకి  వస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ర్టం అభివృద్ధి పథంలో పయనించిందని చెప్పారు.

Back to Top