వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన భాస్కర రామారావు

హైదరాబాద్, 08 మార్చి 2013:

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు బొడ్డు వెంకట రమణ కూడా పార్టీలో చేరారు. మహానేత వైయస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకే పార్టీలో చేరానని భాస్కరరామారావు విలేకరులకు చెప్పారు. లోటస్ పాండ్‌లోని శ్రీమతి విజయమ్మ నివాసంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

Back to Top