వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన వంద కుటుంబాలు

కొత్తగూడెం (ఖమ్మంజిల్లా) : కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీలోని తెలగరామవరం, మాలపల్లి, హోలితండాల నుంచి టిడిపి, సిపిఐ నుంచి వంద కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడు, కొత్తగూడెం నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ‌వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అంతకు ముందు గ్రామంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పాదయాత్ర చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ నాయకత్వం అండదండలు ఎళ్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణ అన్నారు. మే 1న కొత్తగూడెంలో శ్రీమతి షర్మిల పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top