వైయస్ఆర్ సీపీలోకి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

బి. కొత్తకోట (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి  ఆదివారంనాడు  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజక వర్గంలోని బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ పార్టీ కండువా వేసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నాశనం చేశారన్నారు.  గత 30 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు. భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేయాలని తన నియోజకవర్గ ప్రజలను కోరారు.

తాజా ఫోటోలు

Back to Top