'త్వరలో వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన'

హైదరాబాద్:

మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసానికి వెళ్ళి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించనున్న సభ గురించి ఆమెతో చర్చించినట్లు అనంతరం ఆయన విలేకరులకు చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన పేరుతో త్వరలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో సభను నిర్వహిస్తామని కాసాని వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top