త్వరలో టిడిపి కార్యాలయం మూత: నల్లపురెడ్డి

నెల్లూరు, 30 అక్టోబర్‌ 2012: తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే మూసేసుకోవడం ఖాయమని వైయస్‌ఆర్‌సిపికి చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. టిడిపిని, దాని అధ్యక్షుడిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా విశ్వసించడం లేదని ఆయన అన్నారు. నెల్లూరులో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరుగా వరుసగా ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వస్తున్నారని అన్నారు. అబద్ధాలు చెప్పి అందలాలా ఎక్కాలని చూస్తున్న చంద్రబాబు జిమ్మిక్కులను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రమూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
Back to Top