జాతిపితకు వైయస్‌ఆర్‌ సీపీ ఘన నివాళి

హైదరాబాద్‌

: జాతిపిత మహాత్మగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్తీ్ర జయంతి వేడుకలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్తీ్ర చిత్రపటాల వద్ద పార్టీ సీనియర్‌ నేతలు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top