జగనన్న మీరే మాకు దిక్కు

అనంతపురం: జగనన్న మీరే మా దిక్కు అని, మా భవిష్యత్‌ మీరే అని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. జగనన్న మాకు నీరిచ్చి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  వైయస్‌ జగన్‌ కష్టం, పట్టుదల సామాన్యమైనది కాదు, వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు, పులివెందుల పులిబిడ్డ వైయస్‌ జగన్‌ అని పొగిడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి 2009లో పెరూరు ప్రాజెక్టుకు నీరిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. మేమంతా కల కన్నామని, రైతులకు నీరు వస్తుందని కల కన్నామని, వైయస్‌ఆర్‌ మరణంతో మేం దిక్కులేని వారమయ్యామని, మీరే మాకు అండా, కొండా అని విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ఎగువన ఆత్మకూరు మండలంలోని 12 వేల ఎకరాలకు నీరిస్తామని ఆరోజు టెండర్లు కూడా పిలిచారని తెలిపారు. మా నియోజకవర్గంలో 76 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని తెలిపారు. మా హక్కులను కాలరాసే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పీఏబీఆర్‌ రిజర్వాయర్‌ నుంచి మాకు నీరు రావాల్సి ఉందని చెప్పారు. హెచ్‌ఎల్‌సీ కాల్వ వెంట ఉన్న 20 మండలాలకు పొలాలకు నీరు పారే అవకాశం ఉందని తెలిపారు. ఈ కుడికాల్వ కింద ఉన్న మేం అనాథలమయ్యామని, అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మా మండలాలకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. అడిగే నాథుడు లేడని మాకు నీరు ఇవ్వడం లేదన్నారు. మాకు కేవలం వంకల్లో నీరు ఇచ్చి సస్యశ్యామలం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. నీళ్లిచి ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరారు. మహానేత ఈ జిల్లాకు నీరు తెచ్చేందుకు ప్రాజెక్టులు కడితే ఎక్కడ వైయస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందో అని పిల్ల కాల్వలు తవ్వకుండా అన్యాయం చేస్తున్నారని చెప్పారు. తినడానికి తిండి లేక విశ్వనాథరెడ్డి అనే సర్పంచ్‌ బెంగుళూరులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పరిటాల సునీత మీరు నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. 
 
Back to Top