వైయస్సార్సీపీలోకి టీడీపీ నేతలు

నూజివీడు: రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించగల సత్తా వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. నూజివీడులోని ఎమ్మెల్యే కార్యాలయంలో....అన్నవరంలో టీడీపీకి చెందిన మూడో వార్డు సభ్యుడు బూరుగు నరేష్‌ తన అనుచరులతో ఎమ్మెల్యే ప్రతాప్‌ సమక్షంలో వైయస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ కండువాలు కప్పి నరేష్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... చంద్రబాబులాగా నమ్మించి మాట తప్పే స్వభావం జగన్‌మోహన్‌రెడ్డిది కాదన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయని నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్‌ ఒక్కడేనన్నారు. ప్రజలంతా జగన్‌కు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు దేవరకొండ మధు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top