కేసీఆర్‌కు టీడీపీ నేతలు దాసోహం

కంకిపాడు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు దాసోహం అయ్యారని వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నాంచారయ్య మాట్లాడుతూ మంత్రి యనమలకు రూ 2 వేల కోట్లు కాంట్రాక్టు, ఇతర నేతలకూ కేసీఆర్‌ సర్కారు పనులు అప్పగించిందని తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసుకు భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని సైతం వదిలేసి టీడీపీ పారిపోయి వచ్చిందన్నారు. కేసీఆర్‌తో లాలూచీ పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌కు అమ్ముడుపోయారనటానికి ఉమ్మడి రాజధాని వదిలి రావటమే ఉదాహరణ అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, స్వప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్న టీడీపీకీ రానున్న ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టంచేశారు.

Back to Top