ఏం సాధించారని వంద రోజుల పండుగ?

హైదరాబాద్ , సెప్టెంబర్ 15: రైతుల రుణమాఫీ
మొదలు, ప్రజలకిచ్చిన
అన్ని వాగ్దానాలనూ గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం సాధించారని
వంద రోజులు పండుగ జరుపుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల మండలి  సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం తమకు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాల యంలోవిలేకరుల సమావేశంలో
మాట్లాడారు. మంగళవారంతో చంద్రబాబు వంద రోజుల పాలన పూర్తవుతోందని
టీడీపీ వాళ్లుచెబుతున్నారని, కానీ తమ లెక్క ప్రకారం
చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి నాలుగునెలలు పూర్తయిందని, ఆయనే ఆలస్యంగా ప్రమాణ
స్వీకారం చేశారని చెప్పారు. సినిమా హిట్టయితే వంద రోజుల పండుగ జరుపుకోవడం సినిమా రంగంలో ఆనవాయితీ అని,కానీ రాష్ట్రంలో చంద్రబాబు
పాలన ‘ఫట్’ అయినా కూడా బాబు పాలన బ్రహ్మాండం అని హోరెత్తిస్తుండటం
విడ్డూరంగా ఉందనివిమర్శించారు.

ప్రమాణస్వీకారానికిముందే పోలవరం సాధించినట్లు
ప్రకటనల్లో పేర్కొనడాన్ని అంబటి ప్రశ్నిస్తూ ‘పోలవరాన్ని చంద్రబాబు
సాధించారా!హవ్వ... పోలవరం ఎవరు రూపకల్పన చేశారో... ఎవరు
సాధించారో, దాని కోసం ఎవరు తాపత్రయపడ్డారో అనేది జగమెరిగిన సత్యం’. బాబు పాలన మొత్తం మనీ, మర్డర్లు, మేనిపులేషన్, మీడియా మేనేజ్మెంట్
చేయడమే ఫిలాసఫీగా మారిందని దుయ్యబట్టారు.




చంద్రబాబు ఈ వంద రోజుల్లో ఒక్కవాగ్దానం కూడా నెరవేర్చకుండా
అబద్ధాల పాలన సాగిస్తున్నారు. టీడీపీమేనిఫెస్టోలో 200 వాగ్దానాలు, పాదయాత్ర సందర్భంగా 300 మొత్తం 500 వాగ్దానాలు చేశారని వీటిలో ఏ ఒక్కటీ  ఆయన నెరవేర్చలేకపోయారు.



తొలి రోజే ఐదు కీలకమైన అంశాలపైచంద్రబాబు సంతకాలు చేశారని
చెప్పుకుంటున్నారని, మరి సంతకాల ప్రకారంవాగ్దానాలు అమలు జరిగాయా? తాను అధికారంలోకి వస్తే
రైతులు రుణాలు కట్టక్కరలేదన్నారు, మరి ఇపుడు రుణాలు రద్దయ్యాయా? ఆర్బీఐ ఒప్పుకోలేదని
రుణమాఫీ ఎగ్గొట్టింది కాక పచ్చి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అని దుయ్యబట్టారు.



బాబు వచ్చాక విద్యుత్ వెలుగులువచ్చాయని మరో అబద్ధం
చెప్పారు.  ఆర్టీపీపీ(220 మెగావాట్లు)తో  సహా పలుథర్మల్ విద్యుత్ కేంద్రాలు
బొగ్గు కొరత వల్ల మూత పడుతుంటే రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు ఉన్నాయని చెప్పుకుంటారా? 
రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, 365 రోజుల పాటు కరెంటు ఇవ్వడం
అనేది  మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సాధ్యమైతే దానిని కూడా తన ఘనతగా
బాబు చెప్పుకుంటున్నారు.



పెంచుతానన్న వృద్ధాప్య పెన్షన్లుఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వోద్యోగులకుమాత్రమే58 నుంచి 60 ఏళ్లకువయో పరిమితి పెంపు వర్తింపజేసి విద్యుత్, ఆర్టీసీ వంటి 44 ప్రభుత్వ రంగసంస్థల  ఉద్యోగులను గాలికి వదిలేశారు.



బెల్ట్ షాపుల రద్దు పేరుతో చేసినసంతకం అమలు. రాష్ట్రంలోనిజంగాబెల్ట్షాపులురద్దుఅయితేకాలేదు.   మద్యంఅమ్మకాలు ఇంకా ఎలా పెరుగుతాయి? బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం 35 శాతం వరకూ ఉండగా దానిని బాగా తగ్గించారు.   దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరనిద్రోహం చేసినట్లే.



రాజధాని ఎంపిక కోసం కేంద్ర కమిటీపర్యటిస్తూ ఉండగానే
ఫలానా చోట రాజధాని అని ప్రకటించేశారు.
విజయవాడనురాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్రప్రజలతో చర్చించి వారిని సంతృప్తిపరచకుండా అహంకారంతో బాబు ప్రకటనచేయడాన్ని ప్రశ్నిస్తున్నాం.



రాజధాని పెట్టే చోట చంద్రబాబుతాబేదార్లు, సుజనా చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు, సి.ఎం.రమేష్పెద్దఎత్తున భూములు కొనేశారు. భవిష్యత్ లో  వారిపేర్లతోనేనారానగర్, దేవినేని నగర్, సుజనా నగర్ వంటివి
వెలియడానికి దోహదం చేస్తున్నారు.



వంద రోజుల పాలనలో స్థానిక సంస్థల్లోనయాన, భయాన ఎంపీటీసీ, జడ్పీటీసీలను లొంగదీసుకుని
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు . సాక్షాత్తూ స్పీకర్ నియోజకవర్గంలోనే దౌర్జన్యం చేసి ఎంపీటీసీలను లోబర్చుకున్నారు. అనేక చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను దారుణంగా హత్య చేశారు.

తాజా వీడియోలు

Back to Top