<img style="margin-left:5px;margin-top:5px;float:right" src="http://pdf.ysrcongress.com/filemanager/files/News/ShobhaNagiReddy123.jpg" height="130" width="203">హైదరాబాద్, 7 సెప్టెంబర్ 2012: రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే తపన లేని కాంగ్రెస్ సర్కార్ కనీసం చేసిన తప్పును దిద్దుకోవాలన్న ఆలోచన కూడా చేయడంలేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. కిరణ్ కుమార్‌రెడ్డి సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను భారంగా పరిగణిస్తోందని ఆమె మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.