స్వార్థం కోసం ఎందరినైనా బలిచేసే కాంగ్రెస్

విశాఖపట్నం, 30 మే 2013:

కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాల కోసం ఎంతమందినైనా బలి చేస్తుందని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. సిబిఐని అడ్డుపెట్టుకుని, కాంగ్రె‌స్ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు.‌ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని కొణతాల రామకృష్ణ ఆరోపించారు. అనకాపల్లి రింగ్రోడ్డులో ‌కొత్తగా నిర్మించిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

Back to Top