చెరకు రైతులకు షర్మిలకు భరోసా

కొత్త భీమసింగి (విజయనగరం జిల్లా),

10 జూలై 2013: జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వచ్చాక చె‌రకు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సహకార చక్కెర కర్మాగారానికి‌ 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఊపిరి పోశారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. అయితే ఆ మహానేత మరణం తర్వాత చక్కెర కర్మాగారం నష్టాల్లోకి వెళ్లిందని ఆమె విచారం వ్యక్తం చేశారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరును, దానికి రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర 205వ రోజు బుధవారం నాడు ఆమెను జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని కొత్త భీమసింగి వద్ద చెరుకు రైతులు కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల చెరకు రైతుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. చెరకు మద్దతు ధర పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు ఆమెకు విజ్ఞప్తి చేశారు.

Back to Top