'అరబ్ లో తెలుగువారిని ప్రభుత్వం ఆదుకోవాలి'

హైదరాబాద్, 19 జూన్‌ 2013:‌

పొట్ట చేత పట్టుకుని అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథరెడ్డి, శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గల్ఫు బాధితులను ఆదువాల‌ని వారు బుధవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు గల్ఫులోని ఆయా దేశాలకు వెళ్లి ప్రభుత్వాలతో చర్చించి బాధితులైన తెలుగువారికి మేలు జరిగేలా చూడాలని కోరారు. గల్ఫు బాధితుల్లో ఎక్కువగా వైయస్‌ఆర్ జిల్లాకు చెందినవా‌రు ఉన్నారని పార్టీ ఎమ్మెల్యేలు విచారం వ్యక్తంచేశారు.

Back to Top