'తూర్పు' తుపాను ప్రాంతాల్లో ‌పర్యటిస్తున్న జగన్

హైదరాబాద్‌, 26 నవంబర్ 2013:

హెలెన్ తుపాను‌ బీభత్సానికి గురై విలవిలలాడుతున్న అన్నదాతలను పరామర్శించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.  జిల్లా వాసులకు ఏ చిన్న కష్టం వచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే ఆయన పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు ముందు వచ్చారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి‌ విమానంలో రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రావులపాలెం మీదుగా కోనసీమలో పర్యటనకు వెళ్ళారు.

ఈ రోజు శ్రీ జగన్‌ కొత్తపేట, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మీదుగా ఆయన పర్యటన కొనసాతుంది. అవిడి, చెయ్యేరు, కాట్రేనికోన, ఎన్.కొత్తపల్లి, అంబాజిపేట, మాచవరం, రాజోలు, శివకోడు ప్రాంతాల్లో శ్రీ జగన్ పర్యటించి‌ హెలెన్ తుపాను‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులతో ఆయన మాట్లాడతారు.

Back to Top