హైదరాబాద్‌ చేరుకున్న జగన్మోహన్‌రెడ్డి

హైదరాబాద్, 2 అక్టోబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ చేరుకున్నారు.‌‌ శ్రీ జగన్‌తో పాటు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆయన మాతృమూర్తి శ్రీమతి వైయస్‌ విజయమ్మ, సతీమణి శ్రీమతి భారతి కూడా వచ్చారు. మహానేత, తన తండ్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు సిబిఐ కోర్టు అనుమతితో మంగళవారం ఇడుపులపాయ వెళ్లిన ఆయన నగరానికి తిరిగివచ్చారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్కడి నుంచి మంగళవారం రాత్రికే వెంకటాద్రి ఎక్సుప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు.

శంషాబాద్ సమీపంలో‌ని ఉందానగర్ రైల్వేస్టేష‌న్‌లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి భారతి కూడా రైలు దిగారు. శ్రీ జగన్‌కు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉందానగర్‌ రైల్వే స్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. 'జై జగన్‌' నినాదాలతో రైల్వేస్టేషన్‌ హోరెత్తింది.

చాలా కాలం తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాకు వెళ్ళడంతో ఆయనను చూసేందుకు వైయస్ఆర్ జిల్లా వాసులు ‌పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని చూసి ఆనందసాగరంలో మునిగిపోయారు.

Back to Top