నిలకడగా జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి

హైదరాబాద్, 7 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రను కొనసాగించాలంటూ మూడు రోజుల నుంచి సమైక్య దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు. మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌కు సోమవారంనాడు ఉస్మానియా వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. శ్రీ జగన్ కాస్త‌ కొద్దిగా నీరసించినట్లు వైద్యులు గుర్తించారు. మూడు రోజులుగా వేదికపై కూర్చుని ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి నడుంనొప్పితో బాధపడుతున్నారు. శ్రీ జగన్‌ శరీరంలో చక్కెర స్థాయిలు 68కి పడిపోయాయి. బిపి 130/90, పల్సు రేట్ 60గా ఉంది.‌ ఫ్లూయిడ్సు తీసుకోవాలని వైద్యులు శ్రీ జగన్‌కు సూచన చేశారు. శ్రీ జగన్‌ మూత్రంలో కిటోన్ బాడీ‌స్ నెగటి‌వ్‌గా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందని ఉస్మానియా ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ శ్రీవాణి (జనర‌ల్ మెడిసి‌న్) తెలిపారు.

Back to Top