మరింతగా క్షీణించిన జగన్‌ ఆరోగ్యం

హైదరాబాద్, 9 అక్టోబర్ 2013:

సమైక్యాంధ్రకు మద్దతుగా ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నానికి మరింతగా క్షీణించింది. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన దీక్షను కొసాగిస్తుండటంతో బాగా నీరసించిపోయారని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీ జగన్కు బుధవారం మధ్యాహ్నం ఉస్మానియా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తక్షణమే దీక్ష విరమించి గ్లూకోజ్‌ తీసుకోకపోతే ఆయన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే.. సమైక్యాంధ్ర ప్రకటనను కేంద్ర చేసే వరకూ తాను దీక్షను కొనసాగిస్తానని శ్రీ జగన్‌ స్పష్టంగా చెప్పారు.

శ్రీ‌ జగన్ శరీరంలో సుగర్‌ స్ధాయిలు 54కు పడిపోయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఆయన బి.పి. 125/90 గా ఉంది. హార్టు బీటింగ్ 72గా ఉందని, శ్రీ జగన్‌ మూత్రంలో కీటోన్‌లు 4+ కనిపిస్తున్నాయని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్యానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సహకరించాలని వారు కోరారు. శ్రీ జగన్‌కు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు.

నాలుగు రోజులుగా కఠోరంగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌కు నడుంనొప్పి బాగా ఎక్కువైంది. గడచిన నాలుగు రోజులుగా అభిమానులు, శ్రేణులకు కరచాలనం చేస్తూ.. చిరునవ్వుతో పలుకరించిన శ్రీ జగన్ ఈ రోజు నీరసంగా వేదిక మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా క్షీణించడంతో అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

Back to Top