హోదాపై బాబుకు అవగాహన లేదు

విజయవాడ: సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక హోదాపై ఏ మాత్రం అవగాహన లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర యువత అంతా ప్రత్యేక హోదా వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నారన్నారు. యువతీ, యువకుల కోరిక మేరకు ఈ నెల 10వ తేదీన అనంతపురంలో యువభేరీ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ యువభేరీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పాల్గొంటారని చెప్పారు. 

Back to Top