202వ రోజుకు చేరిన షర్మిల మరో ప్రజాప్రస్థానం

విశాఖపట్నం, 7 జూలై 2013 :

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 202వ రోజుకు చేరింది. పాదయాత్ర ఆదివారం కొనసాగే వివరాలను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రకటించారు. శ్రీమతి షర్మిల ఆదివారం నాడు మొత్తం 16.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని వారు తెలిపారు.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురం వద్ద పాదయాత్రను శ్రీమతి షర్మిల మొదలుపెడతారని రఘురాం, శ్రీనివాస్‌ తెలిపారు. అక్కడి నుంచి పైనాపిల్ కాలనీ, దారపాలెం, భీమిలి నియోజకవర్గంలోని అడవివరం, సింహాచలం, గోశాల మీదుగా కొనసాగి అక్కడికి సమీపంలో మధ్యాహ్న భోజనం చేస్తారు.

భోజన విరామం తరువాత శ్రీమతి షర్మిల పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట, సుజాతనగర్, పెందుర్తి జంక్షన్ మీదుగా సరిపల్లి చేరుకుంటారు. రాత్రికి సరిపల్లికి సమీపంలో బస చేస్తారని రఘురాం, శ్రీనివాస్‌ వివరించారు.

Back to Top