హైదరాబాద్‌లో రేపు షర్మిల ఎన్నికల ప్రచారం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. శ్రీమతి షర్మిల ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

‌ఈ నెల 20న జూబ్లీహిల్సు, ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, శేరిలింగంపల్లిలో నిర్వహించే సభల్లో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. 21న మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటా‌న్‌చెరు ప్రాంతాల్లో జరిగే సభల్లో ఆమె పాల్గొంటారు. 22న గ్రేటర్ హైదరాబా‌ద్‌ పరిదిలోని కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారని శివకుమార్ తెలిపారు.

Back to Top