షర్మిల త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

కంకిపాడు:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాత్రి కృష్ణా జిల్లా కంకిపాడు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్టీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పడమట సురేష్‌బాబు, మండల కన్వీనర్ మాదు వసంతరావు, నాయకులు జి.రాజా, కలపాల వజ్రాలు, సయ్యద్ బుడే, కె.జానీ, దాసరి అజయ్ పాల్గొన్నారు. వీరితో ముస్లిం మతగురువులు సయ్యద్ అమీర్, షంషీర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వాల నిరంకుశ పాలనను, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు తెలియజేస్తూ శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ తరుణంలో షర్మిల కాలికి గాయం కావడం బాధాకరమన్నారు. ఆమె త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు.

Back to Top