షర్మిల 31వ రోజు పాదయాత్ర ప్రారంభం

కర్నూలు, 17 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 31వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గణేష్ రైలు మిల్లు నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. శుక్రవారం రాత్రికి షర్మిల గణేష్‌ రైస్‌మిల్లు వద్ద బసచేశారు. ‌పాదయాత్ర ప్రారంభం సందర్భంగా షర్మిలకు వైయస్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా స్వాగతం పలికారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శనివారంనాడు షర్మిల కలుగొట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె మీదుగా కంపాడు వరకూ నిర్వహిస్తారని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ గౌరు వెంకటరెడ్డి ప్రకటించారు. శనివారంనాడు షర్మిల పాదయాత్ర మొత్తం 15 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని ఆయన వివరించారు. రాత్రికి కోడుమూరు నియోజకవర్గంలో షర్మిల బస చేస్తారని పేర్కొన్నారు.

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. మొత్తం 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 
Back to Top