విశాఖలో ముగిసిన షర్మిల పాదయాత్ర

విశాఖపట్నం 08 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా దాటి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆమె సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన యాత్రలో శ్రీమతి షర్మిల  పది నియోజకవర్గాలలో పాదయాత్ర చేశారు. ఏడు బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. విజయనగరం జిల్లాలో ఆమె ఎనిమిది నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహిస్తారు.

Back to Top