షర్మిల 'సమైక్య శంఖారావం'తో మరింత బలం

తిరుపతి, 1 సెప్టెంబర్ 2013:

సమైక్యాంధ్ర నినాదంతో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌తనయ శ్రీమతి షర్మిల చేయనునున్న 'సమైక్య శంఖారావం' బస్సు యాత్ర సమైక్యవాదులకు మరింత బలాన్ని ఇస్తుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుపతిలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం తిరుపతిలోని లీలామహల్ సెంట‌ర్‌లో శ్రీమతి షర్మిల ప్రసంగించనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

సెప్టెంబర్ 2 వైయస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆ మహానేత సమాధిని సందర్శించి అనంతరం శ్రీమతి షర్మిల బస్సు యాత్ర ప్రారంభిస్తారని పార్టీ నాయకులు భూమన, పెద్దిరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారన్నారు. అనంతరం రాత్రికి తిరుపతిలోనే ఆమె బస చేసి 3వ తేదీ ఉదయం చిత్తూరు, సాయంత్రం మదనపల్లిలో బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. అయితే సమైక్య రాష్ట్రం కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఒక్కటే పోరాడుతుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top