చీపురుపల్లిలో ఆదివారం షర్మిల సభ

విజయనగరం 13 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఆదివారం నాడు చీపురుపల్లిలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారానికి 209వ రోజుకు చేరుతుంది. ఉదయం అచ్చుతాపురం నుంచి యాత్ర మొదలవుతుంది. పెనుబర్తి జంక్షన్ వరకూ వెళ్ళిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తదుపరి గరివిడి, శ్రీరామ్ నగర్ మీదుగా చీపురుపల్లి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటయ్యే బహిరంగా సభలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆదివారం శ్రీమతి 15.1కిలోమీటర్ల దూరం ఆమె నడుస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top