నెల్లిమర్లలో షర్మిల బహిరంగ సభ

విజయనగరం 13 జూలై 2013:

విజయనగరం జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం నాటికి 208వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఆమె ఆరో రోజు యాత్రను కొనసాగిస్తారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. శనివారం ఉదయం మిమ్సు మెడికల్ కళాశాల జంక్షన్, నెల్లిమర్లకు పాదయాత్ర తరువాత అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. విరామం తరువాత నెల్లిమర్ల రైల్వే స్టేషన్, గుర్ల, కెల్ల జంక్షన్, గుజ్జింగ వలసల్లో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బస చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top