షర్మిల పరామర్శ యాత్ర షెడ్యూల్..!

ఐదురోజుల పాటు యాత్ర..!
వైఎస్సార్ మరణంతో చనిపోయిన కుటుంబాలకు భరోసా..
దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల...వరంగల్ జిల్లాలో రెండదోశ పరామర్శయాత్ర మొదలుపెట్టారు. ప్రజలు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి 11వ తేదీ వరకు షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది. ఐదురోజుల పర్యటనలో భాగంగా ఆమె మొత్తం 31 కుటుంబాలను  పరామర్శిస్తారు. పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారు.

చనిపోయిన కుటుంబాలకు భరోసా..!
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తండ్రి బాటలోనే నడిచారు. అదేవిధంగా షర్మిల కూడా కుటుంబప్రతినిధిగా దాన్ని ఆచరణలో పెట్టెందుకు  తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించిన ఆమె వరంగల్ లో మొదటి దశ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఆగష్టు  24 నుంచి 28 వరకు మొత్తం 32 కుటుంబాలను పరామర్శించారు.ఇంకా 43 కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది.  దీనిలో భాగంగానే రెండోవిడత యాత్రకు శ్రీకారం చుట్టారు. 

షర్మిల పరామర్శ యాత్ర షెడ్యూల్..!
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి ఈ ఉదయం షర్మిల జిల్లాకు బయలుదేరారు. తొలుత పాలకుర్తి నియోజకవర్గం కొడకండ మండలం గండకుంట నుంచి షర్మిల పరామర్శయాత్ర ప్రారంభించారు. 
సెప్టెంబర్ 7:పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం ఆరు కుంటాబాలకు పరామర్శ
సెప్టెంబర్ 8: మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు..
సెప్టెంబర్ 9:నర్సంపేట నియోజకవర్గంలో 4 కుటుంబాలు, ములుగు కాన్సెటెన్సీలో ఓ కుటుంబానికి పరామర్శ
సెప్టెంబర్ 10: నర్సంపేటలో 2 కుటుంబాలు, పరకాల నియోజకవర్గంలో ఒక కుటుంబానికి, భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు పరామర్శ
సెప్టెంబర్11: పరకాల నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు పరామర్శ

తాజా ఫోటోలు

Back to Top