జగన్‌కు సంఘీభావంగా సీమాంధ్రలో దీక్షలు

హైదరాబాద్, 25 ఆగస్టు 2013 :

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా చంచ‌ల్గూడ జై‌లులో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు సీమాంధ్రలోని సమైక్యవాదులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలంటూ శ్రీ జగన్‌ ఆదివారం ఉదయం నుంచి జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమర దీక్షకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అనేక చోట్ల ఆయనకు మద్దతుగా అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. పలు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు.

‌కృష్ణా జిల్లాలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా పెడన
ఎమ్మెల్యే జోగి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చే‌స్తున్నారు. విజయవాడలో కూడా
శ్రీ జగన్కు సంఘీభావంగా పలువురు ఆమర‌ణ నిరాహార దీక్షలు చేస్తున్నారు.
విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో పార్టీ రూరల్ మహిళ అధ్యక్షురాలు పీల
మహాలక్ష్మి ఆధ్వరంలో దీక్ష ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లా‌లలో కూడా
పలువురు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్షలు
చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి మద్దతుగా నగర ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీ జగన్ ఫోటోలు పట్టుకుని సమైక్యవాదులు తిరుపతి నగర వీధుల్లో ఆయనకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినదించారు. సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ‌నిరసనకారులు హెచ్చరించారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా మదనపల్లెలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నిరాహార దీక్ష ‌ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో పలువురు ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సత్యవేడులో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కన్వీన‌ర్ నిరంజ‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నారు.

వైయస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు ‌చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు దీక్షలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరులో పార్టీ నేత సౌమ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఇదే జిల్లాలోని ఆత్మకూరులో శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో శ్రీ వైయస్ జగ‌న్ అభిమానులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

తాజా ఫోటోలు

Back to Top