వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత

విశాఖః టీడీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన తూర్పుగోదావరి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ నందెపు శ్రీను అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి  వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.సామాన్యులు,వర్తకులను పట్టించుకోకుండా అంకెల గారడీ చేస్తుందన్నారు. జగన్‌ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులమై వైయస్‌ జగన్‌ వెంట ఉండాలని,జగన్‌ ఆశయ సాధనలో సైనికుల్లా పనిచేస్తామన్నారు. రాష్ట్రం ప్రజలు చూపు వైయస్‌ జగన్‌వైపు ఉందని,ఆయన నాయకత్వంలో మంచిరోజులు వస్తాయని ప్రజలందరూ సంపూర్ణంగా నమ్ముతున్నారన్నారు.
Back to Top