స్పీకర్ అండతో అధికారపార్టీ తిట్ల పురాణం

తప్పు చేసినట్లు స్పీకరే క్షమాపణ చెప్పారు
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ఏపీ అసెంబ్లీ: మహిళా పార్లమెంటరీ సదస్సు సందర్భంగా తాను మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశానని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంగీకరించి మహిళలకు క్షమాపణ కూడా చెప్పారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. స్పీకర్‌ ఒప్పుకున్న విషయాలను ఇప్పుడు కాదన్నట్లు సభలో ఆ నాటి మీడియా ప్రసారాలను మళ్లీ ప్రసారం చేయడం దారుణమన్నారు. మళ్లీ ఆ ప్రసారాలు ఎందుకు సభలో చూపించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయారు. ఆ టేపులు చూపి ఉంటే బాగుండేది.
––––––––––––––––––
ఇవేమైనా కుస్తీ పోటీలా?
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ఏపీ అసెంబ్లీ: శాసన సభలో స్పీకర్‌ వ్యవహార శైలిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఖండించారు. సభ్యుల మధ్య స్పీకర్‌ గొడలు సృష్టిస్తూ, కుస్తీ పోటీలు నిర్వహించేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డు బాధితులకు సహాయం చేసే విషయంలో ఈ ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకోవాలి తప్పా. సభ్యుల మద్య గొడవలు సృష్టిస్తున్నారు. ఇవేమైనా కుస్తీ పోటీలా. ఏ మంత్రిపైనానైనా ఆరోపణలు రావడం సర్వసాధారణం, ఇలాంటి సందర్భాల్లో విచారణ జరిపి తాను క్లీన్‌అని నిరూపించుకోవాలి. అగ్రిగోల్డు బాధితులకు ఏదైతే నష్టం జరిగిందో వారిని ఆదుకునే చర్యలు తీసుకోవాలి. మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. వాటిపై రుజువు చేసుకోవాలి తప్ప..మా పై గొడవకు వస్తారా? వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? వీరి తిట్టు విని విని మా గుండె బరువెక్కింది. అయినా ప్రజల కోసం భరిస్తాం. అగ్రిగోల్డు బాధితులను ఏ మేరకు ఆదుకుంటారో ప్రభుత్వం చెప్పాలి.
––––––––––––––––––
వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు సరికాదు
ఎమ్మెల్యే కోన రఘుపతి
ఏపీ అసెంబ్లీ: ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికార పక్షం వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఖండించారు. శుక్రవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సభలో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు బాధాకరం. సవాల్, ప్రతిసవాల్‌ జరుగుతున్నాయి. వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. మంత్రిపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకోవాలి. మంత్రిపై ఏ రకమైన ఆరోపణలు ఉన్నాయని సభలో చెప్పే అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వడం లేదు. ప్రతి సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు లేచి స్పీకర్‌ను డిక్టెట్‌ చేస్తున్నారు. ఇది దురదృష్టకరం.
––––––––––––––––––
ఎవరైతే బాగా తిడుతారో వారికే మైక్‌
ఎమ్మెల్యే రక్షణనిధి
ఏపీ అసెంబ్లీ: శాసనసభ సమావేశాల తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్యే రక్షణనిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే ప్రతిపక్ష నేతను బాగా తిట్టగలుగుతారో వారికే స్పీకర్‌మైక్‌ ఇస్తున్నారని ఆరోపించారు. మీడియా పాయింట్‌లో రక్షణనిధి మాట్లాడారు. ప్రతిపక్షంపై సభలో వ్యక్తిగత దాడులకు దిగడం సరికాదు. ప్రత్యేక హోదాపై సభలో మాట్లాడనివ్వలేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి అవకాశం కల్పించడం లేదు. ప్రజల్లోకి వాస్తవాలు వెల్లకూడదనే ఉద్దేశంతోనే మైక్‌ కట్‌ చేస్తున్నారు. మా నియోజకవర్గంలో అగ్రిగోల్డు బాధితులు చాలా మంది ఉన్నారు. వారికి న్యాయం జరిగే విధంగా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సభలో మాట్లాడాలని ముందుకు వస్తే..దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం అధికార పక్షం చేపట్టింది. గతంలో చాలా మంది స్పీకర్లను చూశాం. కానీ ఇలాంటి స్పీకర్‌ను ఎప్పుడు చూడలేదు. ఎంతోమంది స్పీకర్లు హుందాగా వ్యవహరించారు. విప్‌ చెవిలో మాట చెప్పగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల గుంతు వినిపించేవారు. సవాల్‌కు ప్రతిసవాల్‌ చేసేందుకు కూడా అవకాశం కల్పించడం లేదు. స్పీకర్‌ ఒక్కసారి ఆలోచించండి. మీరు మైక్‌ ఎవరెవరికి ఇస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే బాగా తిట్టగలుగుతారో వారికి మైక్‌ ఇస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న తీరు బాధాకరం. మాకు అవకాశం ఇస్తే అన్ని ఆధారాలతో అగ్రిగోల్డు భూముల కొనుగోలులో జరిగిన అవకతవకలను బట్టబయలు చేస్తాం.
Back to Top