వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆర్టీసీ ఉద్యోగుల సంఘీభావం



శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వైయస్‌ జగన్‌కు అపూర్వ ఆదరణ లభిస్తుందని, ప్రజలు వైయస్‌ జగన్‌కు తమ కష్టాలు తీర్చే నేతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.  కాగా వైయస్‌ జగన్‌ ఇదివరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చారని ఆర్టీసీ నేతలు గుర్తు చేశారు. జననేత సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
 
Back to Top