పశ్చిమాన ప్రకాశిస్తున్న 'సంకల్పం'

ప్రజల కోసమే జననేత పాదయాత్ర

రాజన్న పాలన అందించడమే ధ్యేయం

జిల్లా జిల్లాకు పెరుగుతున్న ప్రజాదరణ

ప్రజా సమస్యలు కడతేర్చేందుకు
ఎక్కడికక్కడ నిర్ణయాలు

నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో
దగాపడ్డామని సర్వత్రా అభిప్రాయం

 పశ్చిమగోదావరి: ఇడుపులపాయ నుంచి
మొదలైన ప్రజా సంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టిస్తోంది. ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర
పూర్తి చేసుకొని తొమ్మిదో జిల్లాలోకి అడుగుపెట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ
అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పశ్చిమ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
ఇడుపులపాయలో ప్రారంభమైన ఒక్క అడుగు అది వేలు.. లక్షల అడుగులుగా మారి పాలకుల
గుండెల్లో దడ పుట్టిస్తోంది.ఏలూరులో రెండు వేల కిలోమీటర్ల మైలురాయి దాటనుంది.  ప్రభుత్వంపై తమ ఆక్రోశాన్ని చాటుతూ నిన్న పెదయడ్లగాడి వంతెనపై
పశ్చిమ వాసులు  పాదయాత్రకు బ్రహ్మరథం పడుతూ
స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ని చూసేందుకు, ఆయన్ను కలుసుకునేందుకు, ఆయనతో తమ సమస్యలు
చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

జనం అంతా జననేత..

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు జిల్లా జిల్లాకు ప్రజాదరణ
పెరుగుతోంది. నాలుగేళ్లు మోసకారి చంద్రబాబు పాలనతో విసికి వేసారిపోయిన ప్రజానీకం
వైయస్‌ జగన్‌ వైపు చూస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వారి
జీవితాల్లో వెలుగులు నింపేందుకు వరాలజల్లులు కురపించారు. 

– రైతు కళ్లలో సంతోషం చూసేందుకు... వ్యవసాయం దండగ కాదు.. పండుగలా
చేయిస్తానని వైయస్‌ జగన్‌ చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు పంటలకు పెట్టుబడి
సాయం అందించడమే కాకుండా.. పంటకు గిట్టుబాటు ధర కూడా దిగుబడి రాక ముందే ప్రకటించే
విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

– రాయలసీమ జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున పాడిపరిశ్రమపైనే ఆధారపడి
ఉన్నారు. పాడి రైతులంతా జననేతను కలిసి సమస్యలు వివరించారు. వీటిపై నిపుణులతో
చర్చించిన వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సహకార డెయిరీలకు సరఫరా చేసే
పాలకు లీటర్‌కు రూ. 4 ప్రభుత్వ ప్రోత్సాహకం చెల్లిస్తామని ప్రకటించారు. జననేత నిర్ణయంతో
రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పాడి రైతుల కుటుంబాలకు ప్రయోజనం. 

– అనంతపురం జిల్లాలో బోర్లు వేసేందుకు అప్పులు చేసి.. నీరు పడక  అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిలో దీనిపై
వైయస్‌ జగన్‌ అధ్యయనం చేసి ప్రభుత్వం రాగానే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని
ప్రకటించారు. 

– చేనేత కార్మికుల సమస్యలను చూసి చెలించిపోయిన వైయస్‌ జగన్‌ 5 లోల కుటుంబాలకు
ప్రయోజనం కలిగే విధానాలను రూపొందించారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు
చేసి వడ్డీలేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా చేనేత కార్మిక మహిళలకు
45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్నారు. 

ఎస్సీ, ఎస్టీల గృహాలకు 250 యూనిట్ల వరకు ఉచిత
విద్యుత్, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500ల యూనిట్లు దాటితే.. గృహ కనెక్షన్‌ చార్జీలు అని ప్రకటించారు. అదే
విధంగా అంగన్‌వాడీ వర్కర్లకు తెలంగాణ కంటే రూ. వెయ్యి వేతనం ఎక్కవ. మసీదుల్లో
ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేల వేతనం, అదే విధంగా దేవాలయాల్లో అర్చకులకు, చర్చిల పాస్టర్లకు గౌరవ వేతనం, దళితలకు ఆర్థిక
స్వావలంబన కోసం 90 శాతం సబ్సిడీతో పాడి పశువులు సరఫరా చేయడం వంటి హామీలను అందజేశారు. 

– బందర్‌పోర్టును 4800 ఎకరాల్లో పోర్టు కడతామని చెప్పారు. ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను
భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 

– విశ్వబ్రాహ్మణులతో జరిగిన సమ్మేళనంలో అనేక సౌకర్యాలతో పాటు
శాసనమండలిలో సభ్యత్వం కూడా ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

– కైకలూరు నియోజకవర్గం పెరికెగూడంలో దళితులతో జరిగిన ఆత్మీయ
సమ్మేళనంలో ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ప్రభుత్వం తరుపు నుంచి లక్ష రూపాయల ఆర్థిక
సాయం అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. 

– వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 25 పార్లమెంట్‌
జిల్లాలు చేసి కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేస్తామని
ప్రకటించారు.  

Back to Top