రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి!


హైదరాబాద్ 11 : ఏప్రిల్ 2013:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, డీఏ సోమయాజులు, రోజా తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

అందరికీ మేలు జరగాలనీ, సమస్యలను అధిగమించడంలో మనకు దేవుడు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాననీ ఆమె అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు ఎప్పుడూ ఉగాదికి ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో త్వరలోనే  వైయస్ 'సువర్ణ పాలన' వస్తుందని శ్రీమతి విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు.

సిద్ధాంతి మారేపల్లి రామచంద్ర శాస్త్రి పంచాంగ పఠనం చేస్తూ శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని జోస్యం చెప్పారు. అలాగే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగు తాయనీ ఆ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ 230 స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టిస్తుందనీ ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావడం తథ్యమన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనామ సంవత్సరంలో గ్రహస్థితి అత్యంత అనుకూలంగా ఉండబోతోందనీ,  వైయస్ఆర్ సీపీ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోదనీ రామచంద్ర శాస్త్రి అన్నారు. 
Back to Top