రాష్ట్రపతిని కలిసే వరకూ 'సంతకం' పొడిగింపు

హైదరాబాద్:

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుమతి లభించేవరకూ 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ క్రమంలో సేకరించే సంతకాల సంఖ్య రెండు కోట్లు దాటవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే 1,52,000 సంతకాలు సేకరించామన్నారు. సంతకం చేయడానికి వచ్చేవారితో పార్టీ రాష్ట్ర కార్యాలయం కిటకిటలాడుతోందని  ఆయన చెప్పారు. సంతకం కార్యక్రమానికి ఊహించనంత స్పందన లభించిందన్నారు.

Back to Top