రానున్నది రాజన్న రాజ్యం


ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్న తీరు, షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు వస్తున్న ఆదరణ దీనికి సంకేతాలు పంపుతున్నాయి. రానున్న కాలంలో రాష్ట్రంలో  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తప్పదని వెల్లడవుతోంది.

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐ  ఒక్కటయిన విషయం ప్రజలకు అవగతమైపోయింది. ఆ మాటకొస్తే చిన్న పిల్లలు కూడా ఈ విషయాన్ని గమనించారు. ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్నీ, భరోసానీ  కల్పించింది. రానున్నది రాజన్న రాజ్యమేనని ప్రజలు ఎదురు చూస్తున్న చిత్రం రాష్ట్రంలో ఆవిష్కృతమవుతోంది. 

ఎన్ని శక్తులు ఏకమైనా రాష్ట్రంలో యువనేత జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరనేదీ స్పష్టమైంది.  కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలు కుమ్మక్కయినప్పటికీ ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్  నేతలు ఉదహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయాలనే లక్ష్యంతో పాటు.. భవిష్యత్తులో స్వర్ణయుగం రానుందనే భరోసా ఇస్తూ జగన్‌మోహనరెడ్డి మరో ప్రస్థానం పాదయాత్రనుచేయాలని యోచించారు. ప్రజల్లో తిరుగుతున్నారన్న ఒక్క కారణంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యి జైల్లో పెట్టించడంతో అది సాధ్యపడలేదు. తన అన్న ఆశయాన్ని ప్రస్తుతం షర్మిల నెరవేరుస్తున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ఆదరణ గమనించిన వారికి గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్‌ను చూసే జనం ఓట్లేశారనీ, సోనియాను చూసి కాదననీ అన్న విషయం కాంగ్రెస్‌నాయకులకు ఇప్పుడిప్పుడే  అర్థమవుతోంది. 

మహానేత వైయస్ఆర్ శ్రీకారం చుట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం చిన్న చూపుచూస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను, పథకాలను చేపట్టలేమని ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. వైయస్ హయాంలో అన్నివర్గాలవారికీ న్యాయం జరిగిందనీ, ప్రస్తుతం ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా జగన్‌మోహనరెడ్డి పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు తెరలేపిన పాదయాత్రను, ఆయన చేస్తున్న అమలు కాని వాగ్దానాలను జనం నమ్మడం కష్టమేనని ఆ పార్టీకి చెందిన నేతల్లో అనుమానాలున్నాయి.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పనితీరునూ.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌తో కలిసి ఆడుతున్న నాటకాన్నీ  జనం గమనిస్తునే ఉన్నారు.  జగనన్న ఆశయంతో పాదయాత్ర చేస్తూ జనంలోకి వచ్చిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరధం పడుతూ.. అక్కున చేర్చుకోవడం చూస్తే రానున్నది జగన్ ప్రభంజనం.. రాజన్న రాజ్యమేనని ప్రజల కళ్లలో ఆశలు చిగురిస్తున్నాయనడంలో సందేహం అక్కర్లేదు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడు వై.యస్. రాజశేఖరరెడ్డి అయితే ఆయన తనయుడు వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి తన కంటిచూపుతో ప్రజా విప్లవం తేగల యువనాయకుడని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చడానికి మరి ఎంతో దూరం లేదని అనిపిస్తోంది.

Back to Top