‘రాజీవ్‌ యువకిరణాలు’ గతి ఏమైంది?: షర్మిల

మూలమళ్ళ (పాలమూరు జిల్లా): 'రాజీవ్‌ యువకిరణాలు' పథకం ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి గొప్పగా చెప్పారని, అయితే ఇప్పుడా హామీ ఏమైందని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. యువకిరణాల గతి ఏమైందని ఆమె నిలదీశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 44వ రోజు శుక్రవారంనాడు శ్రీమతి షర్మిల పాలమూరు జిల్లా మూలమళ్ళలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ అంధ విద్యార్థి శ్రీమతి షర్మిల ముందు తన గోడు ఈ విధంగా వినిపించుకున్నాడు. ‘నా పేరు నవీన్. వికలాంగుడిని.. డిగ్రీ, డీఎ‌డ్ పూర్తి చేశాను. నా సోదరి కూడా వికలాంగురా‌లే. వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్‌ సదుపాయం ఉంది, కానీ అది సరిగా అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి హామీ ఇచ్చిన రాజీవ్ యువకిరణాల‌ ద్వారా మాకు ఇంతవరకు ఎలాంటి ఉపాధీ చూపించలేదు. పైరవీకారుల ఇంటికే యువ కిరణాల ఫలాలు చేరుతున్నాయక్కా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. వికలాంగుడి ఆవేదనపై శ్రీమతి షర్మిల స్పందిస్తూ, జగనన్న రాగానే వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తారని భరోసా ఇచ్చారు.
Back to Top