'రాజన్న పథకాలు.. జగనన్నతోనే సాధ్యం'

కొణిజర్ల (ఖమ్మంజిల్లా): దివంగత మహానేత డాక్టర్ వైస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించడం ఆయన తనయుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యం అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిఇసి సభ్యుడు బాణోత్ మద‌న్‌లాల్‌ పేర్కొన్నారు. జిల్లాలోని పెద్దగోపతి, అనంతారంలలో‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహ ఏర్పాటుకు ఆయన శనివారం భూమి పూజ చేశారు. పార్టీ మహిళా నాయకురాలు కీసర పద్మజా రెడ్డి పూజ నిర్వహించారు.

అనంతరం మదన్‌లాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత వైయస్‌ఆర్ విగ్రహాలను గ్రామగ్రామాన ఏర్పాటు చేసేందుకు అనేక‌ మంది ముందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థలు, సహకార సంఘ ఎన్నికలలో పార్టీ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. జిల్లాలోని 107 సహకార సంఘాలలో అత్యధిక స్థానాలను వైయస్‌ఆర్‌సిపి గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. వైరా నియోజకవర్గంలోని ఏడు సొసైటీలలో గెలుపునకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.

పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, మండల‌ కన్వీనర్ రాయల పుల్లయ్య, నాయకులు తాళ్లూరి చిన్న పుల్లయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, ప్రతాపనేని నరసిం‌హరావు, దుంపల ప్రకాశం, బండి వెంకటేశ్వర్లు, అజీముద్దీన్, పెంటి‌ రామారావు, ప్రతాపనేని బాబూరావు, నాగండ్ల వెంకయ్య, జయరాజు, తప్పెట జకరయ్య, సైదులు, ప్రకాశం, ఆలశ్యం సతీష్, గోపయ్య, చేతుల నాగేశ్వరరావు, యా‌కూ‌బ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top