రాదారిపై బంతి పూలు

మహేశ్వరం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు రంగారెడ్డి జిల్లాలో అరుదైన అనుభవం ఎదురైంది. మహేశ్వరం మండలం హర్షగూడలో ఆమెను చూడడానికి విచ్చేసిన ప్రజలు దారి పొడవున బంతి, చామంతి పూలను పరిచారు.  షర్మిలను వాటిపై నుంచి నడిపించారు. ఈ ఏర్పాటుతో శ్రీమతి షర్మిల ఆనందపరవశులయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహాన్ని ఆమె ప్రారంభించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మంఖాల్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాయంత్రం తుక్కుగూడలో ఏర్పాటైన సభకు భారీ స్థాయిలో జనం హాజయ్యారు. షర్మిల పాదయాత్రలో వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ వెంకటప్రసాద్, ఎస్సీసెల్ కన్వీనర్ రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీసెల్ కన్వీనర్ పాండు నాయక్, జిల్లా స్టీరింగ్ సభ్యులు బొక్క జంగారెడ్డి, మహేందర్‌రెడ్డి, పాండుయాదవ్, మండల కన్వీనర్ రాఘవేందర్‌రెడ్డి, అనంతయ్య, గోపాల్‌నాయక్, తుక్కుగూడ మాజీ సర్పంచ్ కళ్లెం కృష్ణాగౌడ్, జనార్దన్‌రెడ్డి, దర్శన్‌రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్, ప్రసాద్. సాల్మన్, ప్రకాష్, అంజయ్య, రమేష్, దస్రునాయక్, రాజు, మోహన్, లచ్చానాయక్, సేవ్యానాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top