కల్లబొల్లి మాటలతో కాకమ్మ కబుర్లు చెబుతూ..ప్రజలను మోసగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంఅధికారముందని అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదుదమ్మూ, ధైర్యం ఉంటే సాగునీటి సంఘం ఎన్నికలు పెట్టాలిప్రజలు ప్రభుత్వంపై కోపంతో, కసిగా ఉన్నారుః చెవిరెడ్డి
అసెంబ్లీః రాష్ట్ర ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజలను మోసగిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక మాయమాటలతో మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పడం స్వతహాగా వచ్చిన నైజం, మాయమాటలతో కాలం గడుపుతాడు, ఇచ్చిన ఏమాట మీద నిలబడడని ప్రజలు అనుకుంటున్నారని చెవిరెడ్డి అన్నారు. అదే జాడ్యం పల్లెస్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు... టీడీపీ నేతలంతా మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మిస్తూ పరిపాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వీరు ఏమి చెప్పినా నమ్మకూడదని ప్రజలకు అర్థమైపోయిందన్నారు.
తమకు ఓటేస్తే భేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని కోట్లాదిమంది రైతులను మోసగించారని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మోసపూరిత ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. అసెంబ్లీలో అధికారపార్టీ నేతలు ఇష్టారాజ్యంగా బాధ్యతారహితంగా సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ ప్రశ్న అడిగినా వైఎస్ జగన్ ను, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప...ఏమంత్రి కూడా ప్రజాసమస్యలపై స్పందించిన పాపాన పోవడం లేదన్నారు. అధికారం ఉంది, అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతామన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండడం...ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటి సారి చూస్తున్నామన్నారు.
రుణాలు మాఫీ చేయకుండానే చేశామని చెబుతున్న ప్రభుత్వం.....నిజంగా మీకు దమ్మూ, ధైర్యం ఉంటే సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టి చూడాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. అప్పుడు రైతులు ఎవరి చెంప చెల్లుమనేలా తీర్పిస్తారో తెలుస్తుందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా కలెక్టర్ నామినేట్ చేసే పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు. రైతులంతా సమస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకోవడం కోసం సాగు నీటిసంఘాల ఎన్నికలు నిర్వహిస్తారు. కలెక్టర్ నామినేట్ చేస్తే రైతులకేం మేలు జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ప్రభుత్వంపై కోపంగా, కసిగా ఉన్నారు కాబట్టే ఎన్నికలు నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అంగన్ వాడీలకు రూ. 7 వేలు, వర్కర్లకు రూ. 4 వేలు ఇస్తామన్నారు. డేట్ ఇస్తున్నారు. పోస్ట్ పోన్ చేస్తున్నారు. అవి ఎప్పుడు ఇస్తారు బాబు అని చెవిరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కనీస జీతంతో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలను...వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మెడపట్టి గెంటేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను బయటకు తోసేశారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న వాళ్లను తొలగించారు. సాక్షర భారతి వాళ్లకు నయా పైసా ఇవ్వలేదని చెవిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే మట్టి, రాళ్లు , ఆకులు, అలమలు తిని బతకుతారా . ఇదేనా బాబు మీ ఇంటికో ఉద్యోగం అని ఫైరయ్యారు. బాబు మీరేమో జీతాలు తీసుకుంటారు . మీ మంత్రులకు ఇంటి అద్దె లక్ష చెల్లిస్తున్నారు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు దుబారా చేస్తూ విమానాల్లో తిరిగుతున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని కార్మికుడి దగ్గర్నుంచి కర్షకుడు, రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెవిరెడ్డి అన్నారు.