చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారు

ప‌శ్చిమ గోదావ‌రి:  మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెపుతారని వైయ‌స్ఆర్‌సీపీ చింత‌ల‌పూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు అన్నారు. చింతలపూడి మండలం, తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం నవీన్‌బాబు ఆధ్వర్యంలో గడప, గడపకూ వైఎస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాలనపై 100 ప్రశ్నలతో రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికీ తిరిగి అందించారు. కరపత్రంలో ఉన్న అంశాలను చదివి ప్రజల నుండి సమాధానాలు రాబట్టారు. రైతు రురణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని మహిళలను, ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగ యువతను చంద్రబాబు ఏవిధంగా మోసం చేస్తున్నారో ప్రజలకు నవీన్‌బాబు వివరించారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడే వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, జగన్‌ సిఎం అయితే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తారని ఆయన చెప్పారు. గ్రామంలో పెన్షన్లు మంజూరు చేయడం లేదని, ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదని గ్రామస్తులు వైసీపీ నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, వైసీపీ నాయకులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, చిలకబత్తుల వీరాస్వామి, గద్దే వెంకటేశ్వరరావు, ఎస్‌కె సుబాని, బుల్లా కిరణ్, పామర్తి శ్రీనివాస్, తాళం వెంకటేశ్వరరావు, గద్దె బాబూరావు, జుజ్జూరి సత్యన్నారాయణ, చెల్లారి నాగు, సుగుణరావు, కె విజయ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top