ధరల స్థిరీకరణ నిధిపై వాయిదా తీర్మానం

ఏపీ అసెంబ్లీ:  రైతు స‌మ‌స్య‌ల‌పై మ‌రోమారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదిక‌గా పోరాటానికి సిద్ధ‌మైంది. మిర్చి, ఇతర వాణిజ్య పంటలకు లభించని గిట్టుబాటు ధరలు, ధరల స్థిరీకరణ నిధిపై చర్చించాలంటూ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా, అధికార ప‌క్షం అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షానికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా గొంతు నొక్కుతున్నారు. ప్ర‌తిరోజు ఏదో ఒక ప్ర‌ధాన స‌మ‌స్య‌పై ప్ర‌తిప‌క్షం వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెడుతున్నా..ఇంత‌వ‌ర‌కు ఏ అంశంపైనా కూడా ప్ర‌భుత్వం చ‌ర్చించేందుకు ముందుకు రాక‌పోవ‌డం, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జగ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై వ్య‌క్తిగ‌త దాడికి దిగి స‌భా స‌మ‌యాన్ని వృథా చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా, ఆగ్రిగోల్డు స‌మ‌స్య‌లు, చంద్ర‌బాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల‌పై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వీటిపై చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం ముందుకు రాలేదు. శ‌నివారం కూడా అదే ప‌రిస్థితి పున‌రావృతం కావ‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స‌భలో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిపై చ‌ర్చ‌కు ప‌ట్టుప‌ట్టారు. స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్యే స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని కొన‌సాగించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top