మీ అభిమానానికి ఆజన్మాంతం రుణపడి ఉంటా

– జన్మదిన వేడుకలో తొపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
– వేల సంఖ్యలో వేడుకకు హజరైన ప్రజలు
– వందల సంఖ్యలో బైకుల ర్యాలీలు
– అడుగడుగునా అభివందనం 

ఆత్మకూరుః రాప్తాడు వైయస్సార్‌సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త తొపుదుర్తి ప్రకాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలోని తొపుదుర్తి గ్రామంలో అట్టహాసంగా జరిగాయి . పుట్టినరోజు వేడుకకు వచ్చిన ప్రజల అభిమానం, అరుపులు అంబరాన్ని అంటాయి . తొపుదుర్తి ప్రకాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మండలంలోని గ్రామ గ్రామాన ఆయన అభిమానులు కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతపురం నుంచి తొపుదుర్తికి వచ్చే మార్గంలో వందల సంఖ్యలో యువత బైక్‌ ర్యాలీలలో పాల్గొన్నాయి . నియోజక వర్గం నుంచి కొన్ని వందల సంఖ్యలో యువత బైక్‌ల ర్యాలీలను నిర్వహించారు. గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా మహిళలు , పూలు చల్లుతూ హారతులు పట్టారు . అంతేకాకుండా నేల మీద కాలు పెట్టతకుండా ప్రకాష్‌రెడ్డిని యువత తమ భుజాల మీద ఎత్తుకొని బాణా సంచా పెద్ద ఎత్తున పేలుస్తూ గ్రామంలో డప్పులతో ఆయనను ఊరేగించారు . అనంతరం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి , శ్రీ సీతారాముల స్వామి ఆలయాలను ఆయన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలసి దర్శించుకున్నారు. అనంతరం తోపుదుర్తి గ్రామస్తులు ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన స్వగృహం నందు పెద్ద కేక్‌ను కట్‌ చేశారు. కేక్‌ కట్‌ చేసే సమయంలో ప్రకాష్‌రెడ్డిని అక్కడికి వచ్చిన ప్రజలు హ్యాపి బర్త్‌డే టూయు ప్రకాష్‌ అన్న అంటూ సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కటింగ్‌ అనంతరం తండ్రి ఆత్మారామిరెడ్డి ,సతీమణి మనోరమ, కుమారుడు సాయి సిద్దార్థ ఆయనకు కేక్‌ తినిపించారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడికి వచ్చిన అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసి ఫోటోలు దిగారు . అంతకు ముందు అన్నదాన కార్యక్రమానికి పూజ చేసి కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన వేల మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రెడ్డి సొదరులు రాజారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ,(చందు) , జిల్లా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తొపుదుర్తి భాస్కర్‌రెడ్డి , జిల్లా అధికార ప్రతినిథి చంద్రశేఖర్‌రెడ్డి , సీనియర్‌ నేత గూలి కేశవరెడ్డి , మండల కన్వీనర్లు నరసింహారెడ్డి, మెట్టగొవిందరెడ్డి, రామాంజినేయులు,మీనుగ నాగరాజు, నాగముణి, నాగేశ్వరరెడ్డి , యూత్‌ కన్వీనర్లు నరసింహారెడ్డి , నరేంద్రరెడ్డి, జెట్పిటీసీ బిల్లే ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి వెంకట్రాముడు జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబుళపతి , నియోజక వర్గం నుంచి ఎమ్పీటీసీలు, సర్పంచులు , నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back to Top